పట్టణాన్ని రెండుగా చీల్చిన రైలు పట్టాలు..
గాంధీ గంజ్.. బెల్లం దందా
కోడూర్ హనుమాన్ ఆలయం
కిష్టమ్మను కొలుస్తూ.. వ్యవసాయం చేసుకుంటూ జీవించిన కోడూరు ప్రాంత ప్రజలను
ప్లేగు విపత్కర పరిస్థితులు వలసబాట పట్టించాయి. ఇళ్లను వదిలి కోడూరోళ్లంతా మరో
ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ ప్రాంతమే కొత్త ఊరైంది. ఆ ఊరే ప్రస్తుత కామారెడ్డి. గ్రామ
పంచాయతీగా మారిన కోడూరోళ్ల కామారెడ్డి ఇప్పుడు జిల్లా కేంద్రమైంది. వ్యాపార,
వాణిజ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దేశభక్తి, ఆధ్యాత్మిక శక్తి కామారెడ్డి పట్టణాన్ని
ప్రత్యేక గుర్తింపుతో నిలబెట్టాయి.
కామారెడ్డి పట్టణం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కోడూరు ప్రాంతాన్ని ఖాళీ చేసి అక్కడి వారంతా వలస రావడంతో ఏర్పడిన ప్రాంతమే కామారెడ్డి. ‘కామరాట్‌పురం (మన్మ థుడు నివసించే ఊరు) అనే మారుపేరూ కామారెడ్డికి ఉంది. ‘కామారెడ్డి చరిత్ర అంతా కిష్టమ్మగుడితో పెనవేసుకొని ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది’ అని ది వంగత అష్టావధాని అయాచితం నటేశ్వరశర్మ ‘కా మారెడ్డి చరిత్రకు మూలం కిష్టమ్మగుడి’ అనే కావ్యంలో వివరించారు. కిష్టమ్మగుడి ప్రాంతంలో కోడూ రు ఉండేది. అక్కడి వారు తమ ఆరాధ్య దైవంగా వే ణుగోపాలుడి (కృష్ణుడు)ని కొలిచేవారు. కిష్టమ్మగుడిలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలూ, సేవలు, పూజ లూ కొనసాగేవి. అప్పట్లో ప్రస్తుత కామారెడ్డి పట్ట ణం అసలు ఉనికిలో లేనేలేదు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తమ దైవం వేణుగోపాలుడిని కోడూరు ప్రజలు కిష్టమ్మ ఆలయంలో నుంచి ప్రసుతం వేణుగోపాలస్వామి ఆల యంగా పిలువబడుతున్న దేవాలయంలోకి మార్చారు. దీంతో కి ష్టమ్మ గుడి దేవుడులేని కోవెలగా మారిపోయింది. కొంత కాలానికి కోడూరులో ప్లే గు వ్యాధి ప్రబల డంతో ఎన్నో కు టుంబాలు మృత్యువాతపడ్డాయి. ప్లేగు నుంచి త మను తాము రక్షించుకునేందుకు ఇళ్లను వదిలి ప్రస్తుత కామారెడ్డి ప్రాంతానికి వలస వచ్చారు. దీంతో కోడూరు ప్రాంతం నిర్మాణుష్యంగా మారగా, కొత్త ప్రాంతం (ప్రస్తుత కామారెడ్డి) నూతన ఊరు గా మారింది. దోమకొండ సంస్థానాధీశులు ఈ ప్రాంతాన్ని తమ పాలనాపరిధిలోకి తెచ్చుకున్నారు. బహమనీ సుల్తానుల పాలనలో కామారెడ్డి ప్రాంతం దోమకొండ సంస్థానాధీశుల ఏలుబడిలోకి వచ్చి, ఆ పాలకుల సంతానంలోని ఒక కుమారుడైన కామారెడ్డి పేరుతో ఈ ఊరు కామారెడ్డి పేటగా పిలువబడింది. క్రమంగా పేట అనే పేరు తొలగి కామారెడ్డి అనే పేరు సార్థకమైంది. నిజాం కా లంలో ఊరిమీదుగా కొత్త రై ల్వేలైను రావడంతో కామారెడ్డి చిత్రం పూర్తిగా మా రిపోయి, అ ద్భుతమైన పురోగతికి బీ జం పడింది. త రువాత ఏడో నంబ రు జాతీయ రహదారి (ప్రస్తుతం ఎన్‌హెచ్–44) తో మరింతగా వృద్ధి చెందింది. గ్రామ పంచాయతీగా ఉన్న కామారెడ్డి తరువాతి కాలంలో మున్సిపాలిటీగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లో జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది.
కామారెడ్డి పట్టణం సాహితీరంగంతోపాటు ఉద్యమాల్లోనూ అగ్రభాగాన నిలిచింది. నాటి నుంచి నేటి దాకా అనేక సామాజిక అంశాలపై కవులు, రచయితలు ఎన్నో పుస్తకాలు వెలువరించారు. ఆధ్యాత్మిక పుస్తకాలు రాసిన వారెందరో ఉన్నారు. ఉద్యమాలకు కామారెడ్డి కేంద్ర బిందువనే చెప్పాలి. విద్యార్థి ఉద్యమాలైనా, ప్రజా సమస్యలపై వివిధ సంఘాలు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాయి. నిజాం పాలనపై జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం కోసం 1969 నుంచి రాష్ట్రం ఏర్పడేదాకా సాగిన ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశారు. విప్లవోద్యమంలోనూ కామారెడ్డి పాత్ర ఎంతో ఉంది.
కామారెడ్డి పట్టణంలో నాటి నుంచి నేటి దాకా పండగలు ఎంతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఉగాది సందర్భంగా ఎడ్ల బండ్ల ప్రదర్శన ఎంతో ఘనంగా జరుగుతుంది. వేలాది మంది ప్రజలు ఎడ్ల బండ్ల ప్రదర్శనను తిలకిస్తారు. వినాయక చవితి ఉత్సవాలు భారీ ఎత్తున సాగుతాయి. నిమజ్జనం రెండు రోజులపాటు కొనసాగుతుంది. దుర్గా నవరాత్రి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలు కూడా గొప్పగా నిర్వహిస్తారు. పట్టణం వివిధ వ్యాపారాలకు కేంద్రంగా మారింది. కామారెడ్డి ప్రజల్లో దేశభక్తి ఎక్కువ. ఇక ఒక రోడ్డుకు భారత్ రోడ్డు అని, సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జయప్రకాశ్‌నారాయణ్‌రోడ్, సరోజినీదేవి రోడ్డు, గాంధీనగర్, భగత్‌సింగ్‌నగర్... ఎలా ఎందరో జాతీయోద్యమ నేతల పేర్లతో రోడ్లు, కాలనీలు ఉన్నాయి. పట్టణంలో జాతీయ నేతల విగ్రహాలూ ఉన్నాయి.
బెల్లం వ్యాపారానికి పెట్టింది పేరు కామారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో అనకాపల్లి తరువాత బెల్లం అంటే కామారెడ్డి పేరు వినబడేది. స్థానిక గాంధీ గంజ్‌లో బెల్లం వ్యాపారం పెద్ద ఎత్తున నడిచేది. ఇక్కడి నుంచి బెల్లాన్ని గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తరలించేవారు. బెల్లం తయారీతో రైతులు.. వ్యాపారంతో వ్యాపారులు ఆర్థిక వృద్ధిని సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత నల్లబెల్లం పేరుతో మొదలైన ఆంక్షల కారణంగా బెల్లం తయారీ, అమ్మకాలకు ఇబ్బందులు ఎదురై, ఇప్పుడు బెల్లం తయారీ లేకుండాపోయింది.
గంజ్‌లో బెల్లం మీద వసూలు చేసిన సెస్‌తోనే కామారెడ్డిలోని ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మితమైంది.
చరిత్రకు మూలం కిష్టమ్మగుడి
కామారెడ్డి ఆవిర్భావానికి కారణమైన ప్లేగు విపత్కర పరిస్థితులు
పంచాయతీ నుంచి జిల్లా కేంద్రంగా..
అప్పట్లో వ్యవసాయమే జీవనాధారం
ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతున్న పట్టణం
రైల్వే లైను, జాతీయ రహదారితో మారిన రూపురేఖలు
అందరికీ ‘పెద్ద’ చెరువు
కామారెడ్డి పట్టణానికి ఎగువ భాగాన 1897లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో పెద్ద చెరువు నిర్మించారు. దీనికింద కామారెడ్డి, సరంపల్లి, క్యాసంపల్లె, ఉగ్రవాయి గ్రామాల పరిధిలో ఉన్న 858 ఎకరాల ఆయకట్టుకు నీరందించేది. చెరువు నీటితో పట్టణ ప్రజల దాహార్తి తీరేది. పట్టణం నలువైపులా విస్తరించడంతో చెరువు నీటిని తాగునీటి అవసరాలకే వాడుతున్నారు. కాగా పట్టణానికి చుట్టుపక్కల పంట పొలాలు రియల్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లినా, ఇప్పటికీ చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు.
పూర్వ కాలంలో రైల్వే లైను దిగువనే కామారెడ్డి పట్టణం ఉండేది. తరువాతి కాలంలో ఏడో నంబరు జాతీయ రహదారి, ఆ రహదారిపై బస్ డిపో, కొత్త బస్టాండ్‌ల నిర్మాణంతో కొత్త పట్టణం రూపుదిద్దుకుంది. పట్టాల దిగువన, పట్టాల ఎగువన అన్నట్టుగా కొత్త, పాత పట్టణాలు తయారయ్యాయి.
పట్టణాన్ని రెండుగా చీల్చిన రైలు పట్టాలు..
పట్టణాన్ని రెండుగా చీల్చిన రైలు పట్టాలు..
పట్టణాన్ని రెండుగా చీల్చిన రైలు పట్టాలు..
పట్టణాన్ని రెండుగా చీల్చిన రైలు పట్టాలు..


