678 మంది అభ్యర్థులు.. 709 నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

678 మంది అభ్యర్థులు.. 709 నామినేషన్లు

Feb 1 2026 3:15 AM | Updated on Feb 1 2026 3:15 AM

678 మంది అభ్యర్థులు.. 709 నామినేషన్లు

678 మంది అభ్యర్థులు.. 709 నామినేషన్లు

జిల్లాలో ఒకేఒక్క నామినేషన్‌ తిరస్కరణ

నేడు అభ్యంతరాల స్వీకరణ..

రేపు పరిష్కారం

ఎల్లుండి ఉపసంహరణకు గడువు

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నా మినేషన్ల ఘట్టం ముగియడంతో అధికారులు శని వారం స్క్రూట్నీ (పరిశీలన) ప్రక్రియను పూర్తి చేశా రు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 92 వార్డులకుగాను మొత్తం 678 మంది అభ్యర్థులు 709 నామినేషన్లు వేసినట్లు అధికారులు నిర్ధారించారు. పరిశీలనలో ఒకేఒక్క నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం విశేషం.

● కామారెడ్డి మున్సిపాలిటీలో 14వ వార్డుకు చెందిన బండి శ్రీనిధి అనే అ భ్యర్థి వయస్సు 19 ఏళ్లు (కనీస వయ స్సు 21 ఏళ్లు ఉండాలి) మాత్రమే ఉండటంతో అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. పరిశీలన పూర్తికాగా 340 మంది అభ్యర్థులు 341 నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ 58, కాంగ్రెస్‌ 129, బీఆర్‌ఎస్‌ 83, సీపీఎం 3, ఆప్‌, బీఎస్‌పి ఒకటి చొప్పున, ఎంఐఎం 8, ఇతర రాష్ట్రల పార్టీలు 18, స్వతంత్రులు 40 మంది ఉన్నారు.

● బాన్సువాడలో 19 వార్డులకు గాను 160 మంది అభ్యర్ధులు 250 నామినేషన్‌లు దాఖలు చేయగా ఒక్క దరఖాస్తు తిరస్కరణకు గురి కాలేదు. చివరగా 158 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 176 నామినేషన్‌లు ఓకే అయ్యాయి. వీరిలో బీజేపీ 22, కాంగ్రెస్‌ 98, బీఆర్‌ఎస్‌ 40, ఎంఐఎం 1, స్వతంత్రులు 15 మంది ఉన్నారు.

● ఎల్లారెడ్డిలో 12 వార్డులకు 75 నామినేషన్‌లు దా ఖలయ్యాయి. బీజేపీ 14, కాంగ్రెస్‌ 26, బీఆర్‌ఎస్‌ 24, బీఎస్పీ 2, స్వతంత్రులు 9 మంది ఉన్నారు.

● బిచ్కుందలో 12 వార్డులకు 117 నామినేషన్‌లకు ఆమోదముద్ర లభించింది. వీరిలో బీజేపీ 21, కాంగ్రెస్‌ 32, బీఆర్‌ఎస్‌ 26, బీఎస్పీ 1, స్వతంత్రులు 3 మంది ఉన్నారు.

షెడ్యూల్‌ ప్రకారం, నామినేషన్లు తిరస్కరణకు గురైన వారు ఆదివారం అప్పీలు చేసుకునే అవ కాశం ఉంది. వాటిని సోమవారం పరిష్కరిస్తారు. ఇక అత్యంత కీలకమైన ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. తిరుగుబాటు అభ్యర్థులను (రెబల్స్‌) బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు ఈ సమయాన్ని కీలకంగా వాడుకోనున్నారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు విడుదల చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement