బల్దియా బాగు బీజేపీతోనే సాధ్యం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి, అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ లో గత పాలకుల తీరును వివరిస్తూ అప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత చేపట్టిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా వివరించారు. ప్రతి నెలా రూ.1.74 కోట్ల ఖర్చు ఉంటే ఏటా రూ.6 కోట్ల ఆదాయం ఉండేదని గత పాలకుల పనితీరు ఎలా ఉండేదో ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా బల్దియా రూ.70 కో ట్ల అప్పుల ఊబిలో కూరుకుపోతే, తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే ఆదాయాన్ని పెంచి రూ. 30 కోట్ల భారం తగ్గిస్తేనే పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. సర్వే నంబర్ 6లో ఎకరంన్నర ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేలా చేసింది బీజేపేనని అన్నారు. రోడ్డు విస్తరణ కోసం తన సొంతింటిని కూల్చేసుకున్నానని, మసీదు మడిగెల తొలగింపునకు అంగీకారం లభించినా కొందరు పంచముఖి ఆలయం పేరుతో రాజకీయం చేసి పనులు అడ్డుకున్నారని ఆరోపించారు. కామారెడ్డిని నంబర్ వన్ చేస్తామని, ఇందుకు బీజేపీ కౌ న్సిల్ కావాలని ఓటర్లను కోరారు. మార్చి 10న నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లకు 5400 డెస్క్‌లను కేపీఆర్ జనసేవా ట్రస్టు ద్వారా అందజేయ నున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబా ద్‌ను వదిలి కామారెడ్డిలోనే ఉంటే తాను ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి తనతోనే వేదిక పంచుకుంటానని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో వచ్చిన నిధులను రివైజ్డ్ చేయించుకుని శంకుస్థాపనలు చేస్తుండటం విడ్డూరమని, స్వయంగా ఎన్ని ప్రొసిడింగ్ ఆర్డర్లు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం రాజులు, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి తదితరులున్నారు.
రూ.70 కోట్ల అప్పుల్లో
రూ. 30 కోట్ల భారాన్ని తగ్గించాం
అక్రమాలు, అవినీతి, కబ్జాలకు
అడ్డుకట్ట వేశాం
మీడియాతో ఎమ్మెల్యే కేవీఆర్


