అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
కామారెడ్డి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ పథకాల కింద వచ్చిన నిధులతో అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని జెడ్పీ సీఈవో చందర్ అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తించి పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగంగా పూర్తి చేయించి లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులు చేసేలా చూడాలన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న తాడ్వాయి, పిట్లం ఎంపీడీవోలు సయ్యద్ సాజీద్ అలీ, ఎన్.రఘులతోపాటు జెడ్పీ పర్యవేక్షకురాలు విజయలక్ష్మిని ఎంపీడీవోల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ ప్రతినిధులు సంతోష్‌కుమార్, గోపిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని డీసీహెచ్‌ఎస్ విజయ్‌భాస్కర్, డీఎంహెచ్‌వో దివ్య శనివారం పరిశీలించారు. ఆస్పత్రి ధోబీ కళ సస్పెన్షన్ ఎత్తివేతపై విచారణ చేపట్టారు. అనంతరం ఆస్పత్రిలో ఎదురవుతున్న సమస్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అర్ధంతరంగా నిలిచిన ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్రమోహన్, రీజినల్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావు, వైద్యులు ఉన్నారు.
హైకోర్టు జడ్జికి విన్నపాలు
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రానికి శనివారం విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జిలు శ్యామ్ కోషీ, నందికొండ నర్సింగ్‌రావులను కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లాకు అవసరమైన పదవులు, నిధులపై హైకోర్టు జడ్జి శ్యామ్ కోషీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ మాట్లాడుతూ.. నూతన కోర్టు భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, పోక్సో కోర్టు న్యాయమూర్తి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి పదవులను భర్తీ చేయాలని కోరినట్లు తెలిపారు. జిల్లా జడ్జి వరప్రసాద్, అసోసియేషన్ ప్రతినిధులు జగన్నాథం, రమేష్ చంద్, శ్యామ్‌గోపాల్ రావు, వెంకట్రామిరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి


