మున్సి‘పోల్’ గుర్తులు ఇవే..
బాన్సువాడ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతాయి. స్వతంత్రులకు కోసం 75 గుర్తులను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బి– ఫారం ప్రకారం పార్టీ గుర్తులు, మిగిలిన వారికి అక్షర క్రమంలో స్వతంత్ర చిహ్నాలు ఇస్తారు.
జాతీయ, రాష్ట్ర పార్టీల చిహ్నాలు..
జాతీయ పార్టీల్లో బీజేపీ(కమలం),కాంగ్రెస్(చెయ్యి),ఆమ్‌ఆద్మీ(చీపురు), బీఎస్పీ(ఏనుగు), ఇండియన్ ముస్లిం లీగ్(నిచ్చెన), సీపీఎం(సుత్తి– కొడవ లి–నక్షత్రం), రాష్ట్ర పా ర్టీల్లో ఏఐఎంఐఎం (గాలిపటం), బీ ఆర్‌ఎస్(కారు), వైఎస్సార్‌సీపీ(ఫ్యాన్), టీ డీపీ(సైకిల్),రిజిస్టర్ పార్టీల్లో ఫార్వర్డ్ బ్లాక్( సింహం),సీపీఐ(కంకి–కొడవలి),జనసేన(గాజుగ్లాస్).
స్వతంత్ర గుర్తులు..
ఎయిర్ కండిషనర్, యాపిల్, గాజు లు, పండ్లబుట్ట, బ్యాట్, బైనాక్యూల ర్, సీసా, బ్రెడ్, బకెట్, కెమెరా, చెయిన్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, కొబ్బరి తోట, మంచం, కప్పు, కటింగ్ ప్లేయర్, డ్రిల్లింగ్ మెష న్, డంబెల్స్, విద్యుత్ స్తంభం, ఎన్వ లప్, పిల్లనగ్రోవి, ఫుట్‌బాల్, గౌను, గ్యాస్‌సిలిండర్, గ్రామ్‌ఫోన్, ద్రాక్ష, పచ్చిమిర్చి, తోపుడు బండి, హెడ్‌ఫోన్, హాకీ కర్ర, బంతి, పనస, బెండకాయ, పోస్ట్‌డబ్బా తదితర గుర్తులు కేటాయిస్తారు.
అయితే వీటిలో చాలా వరకు ఓటర్లు గుర్తు పట్టడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


