ఊరంతా ఒకటే వార్డు!
టేక్రియాల్ గ్రామం
కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైన టేక్రియాల్ గ్రామం అంతా ఒకే వార్డు పరిధిలోనే ఉంది. గ్రామంలోని 1,848 మంది ఓటర్లందరూ అందులోనే. వీరిలో 980 మంది మహిళలు, 868 మంది పురుషులు ఉన్నారు. ము న్సిపాలిటీలో విలీనమైన వేరే గ్రామాలు పక్క గ్రామాలు, పట్టణంలోని కాలనీలతో కలిసి వార్డులుగా ఉంటే, టేక్రియాల్ ఊరంతా ఒక వార్డుగా ఉంది. 2019లో మున్సిపాలిటీలో విలీనమైన టేక్రియాల్ గ్రామాన్ని 13వ వార్డు గా గుర్తించారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో గ్రామానికి చెందిన శంకర్‌రావ్ కౌన్సిలర్‌గా గెలుపొందారు. ప్రస్తుతం వార్డు ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. గతంలో సర్పంచ్‌ను ఎన్నుకున్న వారే ఇప్పుడు కౌన్సిలర్‌ను ఎన్నుకుంటారు. –సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


