మెప్మా ఆర్పీపై దుండగుల దాడి
● లోన్ రికవరీకి వెళ్లి వస్తుండగా ఘటన
● అధికారుల ఒత్తిళ్లు, బ్యాంకు మేనేజర్ తీరుపై ఆర్పీల ఆందోళన
కామారెడ్డి క్రైం: రా త్రిపూట లోన్ రిక వరీకి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తున్న మె ప్మా రీసోర్స్ పర్సన్‌పై గుర్తు తెలియ ని వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామానికి చెందిన చంద్రకళ ఆర్పీగా పని చేస్తోంది. రుణాలు తీసుకున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైనా సకాలంలో తిరిగి చె ల్లించకపోతే బ్యాంకర్లతో కలిసి నిత్యం ఆర్పీలు ఇ ళ్లకు వెళ్లి రికవరీ చేస్తుంటారు. అదే తరహాలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఐఓబీ బ్యాంకు మేనేజర్‌తో కలిసి చంద్రకళ గ్రామంలోని పలు ఇళ్ల కు రికవరీ కోసం వెళ్లారు. పనులు పూర్తి చేసుకుని స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా నిర్మానుష్య ప్ర దేశంలో మరో బైక్‌పై వెనుక నుంచి వచ్చిన గుర్తు తె లియని వ్యక్తులు చంద్రకళపై దాడి చేశారు. కర్రతో మెడపై కొట్టడంతో అక్కడే పడిపోయిన చంద్రకళ కొద్దిసేపటికి తేరుకుని అతి కష్టం మీద ఇంటికి వె ళ్లింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కామా రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఆర్పీల ఆందోళన
చంద్రకళపై దుండగుల దాడి చేయడాన్ని మండ లంలోని మిగితా ఆర్పీలు సీరియస్‌గా తీసుకున్నా రు. శనివారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ముందుగా ఐఓబీ బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఇది కచ్చితంగా బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 7 తర్వాత రుణాల రికవరీకి వెంట రా వాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఆస్పత్రికి వ చ్చిన మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డితో మాట్లాడుతూ రాత్రి పూట విధుల విషయంలో ప్రశ్నించారు. ఆర్పీలకు భద్రత కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి భర్త నవీన్ దేవునిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై పీడీని వివరణ కోరగా రాత్రి 7 తర్వాత విధులకు తీసుకువెళ్లడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.
మెప్మా ఆర్పీపై దుండగుల దాడి


