క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Feb 1 2026 3:11 AM | Updated on Feb 1 2026 3:11 AM

క్రైం

క్రైం కార్నర్‌

కడుపునొప్పితో విద్యార్థిని మృతి

బాన్సువాడ: బీర్కూర్‌ మండల కేంద్రంలో ఓ విద్యార్థిని కడుపునొప్పితో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. బీర్కూర్‌కు చెందిన శివశ్రీ(8) అనే విద్యార్థిని గ్రామంలోని బాలికల ప్రైమరీ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. రోజూ మాదిరిగానే శుక్రవారం చిన్నారి పాఠశాలకు వెళ్లింది. కడుపు నొప్పిగా ఉందని ఉపాధ్యాయులకు చెప్పడంతో ఆమెను ఇంటికి పంపించారు. ఇంట్లో విద్యార్థిని తల్లిదండ్రులు లేకపోవడంతో ఇంటి వద్దనే పలుమార్లు వాంతులు, విరేచనాలు చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శివశ్రీ నీరసంగా కనబడడంతో ఆస్పత్రికి వెళ్దామని తల్లిదండ్రులు చెప్పడంతో చిన్నారి వద్దని తెలిపింది. దీంతో వారు చిన్నారిని ఇంట్లోనే ఉంచారు. ఉదయం చూసే సరికి శివశ్రీ లేవకపోవడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సలహా మేరకు బాన్సువాడ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే శివశ్రీ మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో శివశ్రీ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో సర్పంచ్‌ ధర్మతేజ, ఎస్సై మహేందర్‌లు బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు.

చేపల వేటకు వెళ్లి ఒకరు..

మాచారెడ్డి: చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన సోమారంపేట పంచాయతీ పరిధిలోని రోడ్డుబండతండాలో చోటుచేసుకుంది. ఎస్సై అనిల్‌ తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన బన్సి అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి గ్రామ శివారులోని చెరువులోకి చేపలు పట్టేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ముందుగా బన్సి చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఆయనతో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి వచ్చి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే చీకటి పడడంతో వెతకలేకపోయారు. శనివారం చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.

చికిత్సపొందుతూ ఒకరు..

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట మండలంలోని బంజరకు చెందిన సాతెల్లి బాలరాజు(45)అనే వ్యక్తి గత నెల 26న రాత్రి మరోవ్యక్తితో కలిసి బంజర వద్ద రోడ్డును దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో బాలరాజును చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని గాంధీఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి అతడు మృతిచెందినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపారు.

క్రైం కార్నర్‌1
1/3

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌2
2/3

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌3
3/3

క్రైం కార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement