ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి.. | - | Sakshi
Sakshi News home page

ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి..

Feb 1 2026 3:11 AM | Updated on Feb 1 2026 3:11 AM

ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి..

ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి..

చికిత్స పొందుతూ ఎకై ్సజ్‌

కానిస్టేబుల్‌ సౌమ్య మృతి

గంజాయి ముఠా కారుతో ఢీకొన్న

ఘటనలో తీవ్రగాయాలపాలైన కానిస్టేబుల్‌

నిజామాబాద్‌అర్బన్‌: ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య(23) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఇటీవల గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు నగర శివారు మాధవనగర్‌ వద్ద ఎకై ్సజ్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసిన గంజాయి ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ముఠా సభ్యుడు కారును సౌమ్య పైకి ఎక్కించడంతో ఆమె తీవ్రంగా గాయపడ్దారు. దీంతో ఎకై ్సజ్‌ పోలీసులు హుటాహుటిన ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ సౌమ్య తుదిశ్వాస విడిచారు. ఎనిమిది రోజులపాటు సౌమ్య ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడారు. జనవరి 23న దుండగులను పట్టుకునే క్రమంలో సౌమ్యకు పొత్తి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. బాసటగా నిలిచిన ఎకై ్సజ్‌ అధికారులు దగ్గరుండి చికిత్స చేయించారు. ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు నేతలు ఆమెను పరామర్శించారు. చికిత్స కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేసింది. మోస్రాకు చెందిన సౌమ్యది సామాన్య కుటుంబం. 2024 సంవత్సరంలో సౌమ్య ఉద్యోగంలో చేరారు. అంతలోనే మరణించడంతో కుటుంబీకులు గుండెలవిసెలా విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement