బోర్లంలో ఒకరి ఆత్మహత్య
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాన్సువాడ ఎస్‌హెచ్‌వో శ్రీధర్ తెలిపిన వివరాలు ఇలా.. బోర్లం గ్రామానికి చెందిన ఆరెల్లి రాములు(45) అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కొంత కాలంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో అతడు జీవితంపై వి రక్తి చెంది శుక్రవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తె లిసిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
ఫరీద్‌పేటలో ఒకరు..
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీద్‌పేట గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా.. ఫరీద్‌పేట గ్రామానికి చెందిన కమ్మరి కుమార స్వామి (45) కొంతకాలంగా కామారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. గతంలో అత డు రోడ్డు ప్రమాదంలో గాయపడగా, చికిత్స కోసం రూ.15 లక్షలు అప్పు చేశాడు. శుక్రవారం మధ్యా హ్నం అతడు సొంతూరు ఫరీద్‌పేటకు వెళ్లొస్తానని భార్యకు చెప్పి, బయలుదేరాడు. శనివారం ఉద యం కుమారస్వామి ఫరీద్‌పేటలోని తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడని భార్యకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అప్పులు తీర్చే మార్గం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
స్కూల్ బస్సుకు తప్పిన ముప్పు
నవీపేట: మండల కేంద్రంలోని ఆదర్శ విద్యానికేతన్‌కు చెందిన స్కూల్‌బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నవీపేట రైల్వేస్టేషన్ ఏరియా నుంచి శ నివారం విద్యార్థులను బస్సులో ఎక్కించుకుని బ యలుదేరగా, మార్గమధ్యలో ఒక్కసారిగా బ్యాటరీ నుంచి పొగ వచ్చింది. షార్ట్ సర్క్యూట్‌తో పొగ చెలరేగడంతో డ్రైవర్ రాము అప్రమత్తమై బస్సును ఆ పేపి చిన్నారులను దించేశాడు. చుట్టుపక్కల వారు నీటితో బ్యాటరీ నుంచి వస్తున్న పొగను, మంటల ను ఆరిపేశారు. బస్సులో ప్రయాణిస్తున్న 50 మంది చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ ఘటనపై నిజామాబాద్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, స్థానిక ఎస్సై శ్రీకాంత్ విచారణ జరిపారు.


