బాధ్యతతో ఎన్నికల విధులు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతతో ఎన్నికల విధులు నిర్వహించాలి

Jan 31 2026 7:17 AM | Updated on Jan 31 2026 7:17 AM

బాధ్యతతో ఎన్నికల విధులు నిర్వహించాలి

బాధ్యతతో ఎన్నికల విధులు నిర్వహించాలి

బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి

బాన్సువాడ: ఎన్నికల విధులపై నిర్లక్ష్యం తగదని, బాధ్యతతో విధులు నిర్వహించాలని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి సూచించారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు విధులు నిర్వహించే అధికారులు, సహాయ ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నికలకు హాజరయ్యే అధికారులకు మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి రాజు, ఎంఈవో నాగేశ్వర్‌రావు ఉన్నారు.

విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి

పదో తరగతి చదివే విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. శుక్రవారం రెడ్డి సంఘంలో షెడ్యూల్డ్‌ కులాల, వెనుకబడిన తరగతుల, గిరిజన అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి, ప్రేరణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.

బిచ్కుంద(జుక్కల్‌): బిచ్కుందలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి సందర్శించి పరిశీలించారు. సందేహాలు ఉంటే పైఅధికారులతో మాట్లాడి తప్పులు జరుగకుండా చూసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement