రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Dec 10 2025 7:53 AM | Updated on Dec 10 2025 7:53 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొని ఒకరు.. అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య మద్యం పట్టివేత

డిచ్‌పల్లి: మండలంలోని కంచెట్టి దాబా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మతి చెందినట్లు ఎస్సై మహమ్మద్‌ ఆరిఫ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. తెల్లవారుజామున దాబా ఎదురుగా ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మెడ కుడి వైపునకు టాటూ, ఎడమ, కుడి చేయి మణికట్టుల వద్ద టాటూలు ఉన్నాయి. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659852, 8712659851 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డుపై నిలిపిఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని నర్సాపూర్‌ గ్రామానికి చెందిన సోమార్‌పేట లింగయ్య(60) మంగళవారం తన టీవీఎస్‌ ఎక్సెల్‌పై పశువుల దాణా కోసం బాన్సువాడ వెళ్లాడు. రాత్రివేళ పశువుల దాణాను ఎక్సెల్‌పై తీసుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. మొండిసడక్‌– బాన్సువాడ ప్రధాన రహదారిపై ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్‌ టైర్‌ పంక్చర్‌ కావడంతో అక్కడే నిలిపిఉంచారు. ఈక్రమంలో లింగయ్య ఎక్సెల్‌పై అదే రోడ్డు గుండా వస్తుండగా ట్రాక్టర్‌ ట్రాలీని వెనుక నుంచి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇసుకను కిందికి తోడేసి ట్రాలీని పక్కకు తీసినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.

నాగిరెడ్డిపేట: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ల పోచయ్య(42) గతేడాది పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి చేయి విరిగింది. విరిగిన చేయికి పలుచోట్ల వైద్యం చేయించినా సరికాలేదు. దీంతో మనస్తాపానికి గురైన పోచయ్య మంగళవారం వేకువజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

బీబీపేట: మండలంలోని మాందాపూర్‌ గ్రామంలో ఎన్నికల కోడ్‌ను అతిక్రమించి ఓ కార్ఖానాలో దాచి ఉంచిన మద్యం బాటిళ్లను ఎఫ్‌ఎస్‌టీ వెంకటలక్ష్మి పట్టుకున్నారు. మొత్తం 171 క్వార్టర్‌ బాటిళ్లు, రూ. 35 వేల విలువ గల మద్యాన్ని పట్టుకొని సీజ్‌ చేసినట్లు ఆమె తెలిపారు.

మల్లయ్యపల్లి శివారులో..

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని మల్లయ్యపల్లి శివారులో మూడు కాటన్ల మద్యం సీసాలు పట్టుబడినట్లు ఎస్సై మహేశ్‌ మంగళవారం తెలిపారు. గ్రామ శివారులో ఎఫ్‌ఎస్‌టీ టీం అధికారులు గిర్దావార్‌ శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌తో కలిసి వాహనాల తనిఖీ చేపడుతుండగా పాపన్నపేట్‌ మండలం పాత లింగయ్యపల్లి గ్రామానికి చెందిన చింతకాయల రమేశ్‌ అనే వ్యక్తి ఆటోలో మూడు కాటన్ల మద్యాన్ని తీసుకెళ్తుండగా పట్టుకున్నామని దీని విలువ రూ. 28 వేలు ఉంటుందని అన్నారు. మద్యాన్ని సీజ్‌ చేసి మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి1
1/2

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి2
2/2

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement