రేషన్‌బియ్యం పట్టివేత
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 46 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. బుస్సాపూర్ కేంద్రంగా బాల్కొండకు చెందిన వినీష్, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సుపీయన్లు ఓ ఇంట్లో రేషన్ బియ్యం దాచి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో దాడి చేసి రేషన్‌బియ్యం పట్టుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
బోధన్‌లో 28 క్వింటాళ్లు..
బోధన్: ఎడపల్లి మండల కేంద్రం శివారులో రేషన్‌బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఆటో గూడ్స్ వాహనాన్ని సోమవారం సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ ఇచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌బియ్యం వాహనాన్ని పట్టుకున్నట్లు సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మహేశ్ కుమార్, పవన్‌కుమార్ తెలిపారు. వాహనంలో 28 క్వింటాళ్ల 60 కిలోల బియ్యం ఉన్నట్లు వెల్లడించారు. వాహనం, బియ్యం స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ మహ్మద్ మదినితోపాటు మరో వ్యక్తి షేక్ ఆఫ్పాన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పాడని పేర్కొన్నారు.
ఇద్దరి రిమాండ్
ఆర్మూర్‌టౌన్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. పట్టణానికి చెందిన పద్మ రంజిత్, వేల్పూర్‌కు చెందిన రేషన్‌డీలర్ మేకల పాపన్న ఈ నెల 7న రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని సోమవారం ఆర్మూర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
రేషన్‌బియ్యం పట్టివేత


