ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు దరఖాస్తులు
నిజామాబాద్‌నాగారం: జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో 17 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో రాజశ్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 14 వరకు నూతన కలెక్టరేట్ కార్యాలయంలోని డీఎంహెచ్‌వో ఆఫీసులో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు nizamabad.telangana.gov.in వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు తాళ్లపల్లి నర్సాగౌడ్(58) సోమవారం మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కల్లు తీయడానికి నర్సాగౌడ్ చెట్టు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సరోజన ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులకు, తోటి గీత కార్మికులకు సమాచారం ఇచ్చింది. తాటివనంలో వెతకగా ఒక చెట్టు వద్ద మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● కాపర్ ఆయిల్ చోరీ
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంతోపాటు శివారు గ్రామ శివారులోని రెండు ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేశారు. రైతులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి శివాపూర్ గ్రామ శివారులో చావునితండాకు చెందిన సహరి బాయ్, పెద్దకొడప్‌గల్ గ్రామానికి చెందిన ఆట్కరి హన్మంత్ రావుకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్లలోని ఆపర్ ఆయిల్‌ను దుండగులు చోరీ చేశారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.


