మానవ అక్రమరవాణా నిర్మూలన అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మానవ అక్రమరవాణా నిర్మూలన అందరి బాధ్యత

Oct 18 2025 7:33 AM | Updated on Oct 18 2025 7:33 AM

మానవ అక్రమరవాణా నిర్మూలన అందరి బాధ్యత

మానవ అక్రమరవాణా నిర్మూలన అందరి బాధ్యత

మానవ అక్రమరవాణా నిర్మూలన అందరి బాధ్యత రేపు, ఎల్లుండి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు మద్యం దుకాణాలకు 833 దరఖాస్తులు నేడు ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు తెయూలో స్పాట్‌ అడ్మిషన్స్‌

బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి

బాన్సువాడ: మానవ అక్రమరవాణాను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి పేర్కొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో స్కూల్‌ అసిస్టెంట్లకు రెండ్రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ మానవుల అక్రమ రవాణాను నిర్మూలించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అని పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి మానవ అక్రమరవాణా నిరోధంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌ లక్క నరహరి, ఫౌండేషన్‌ ప్రతినిధులు సిరజ్‌, సంజీవులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్‌ హైస్కూల్‌ మైదానంలో ఈ నెల 19, 20 తేదీల్లో సీహెచ్‌ శ్రీనివాస్‌ స్మారక రాష్ట్రస్థాయి ఇన్విటేషన్‌ కబడ్డీ టోర్నీ నిర్వహిస్తున్నట్టు ఆర్గనైజింగ్‌ ప్రతినిధులు సీహెచ్‌ రాజు, జి భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవానికి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశ్‌, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. మ్యాట్‌పై నిర్వహించే ఈ పోటీలకు ఇప్పటికే 15 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయని తెలిపారు.

కామారెడ్డి రూరల్‌: జిల్లాలోని మద్యం దుకాణాలకు శుక్రవారం 414 దరఖాస్తులు వచ్చాయని ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ హనుమంత రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 49 దుకాణాలకు ఇప్పటి వరకు 833 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి స్టేషన్‌ పరిధిలో 15 దుకాణాలకు 240, ఎల్లారెడ్డి స్టేషన్‌ పరిధిలో 7 దుకాణాలకు 154, బాన్సువాడ స్టేషన్‌ పరిధిలో 9 దుకాణాలకు 131, దోమకొండ స్టేషన్‌ పరిధిలో 8 దుకాణాలకు 172, బిచ్కుంద స్టేషన్‌ పరిధిలో 10 దుకాణాలకు 131 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

దోమకొండ: దోమకొండ గడికోటలో శనివారం ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలను నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తిర్మల్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి కదిరె మోహన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు క్రీడా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారని వారు వివరించారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో 2025–26 విద్యాసంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించను న్నట్లు అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ వాసం చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి 21 మధ్యాహ్నం 12 గంటల వరకు దర ఖాస్తులు స్వీకరిస్తారన్నారు. అదేరోజు మ ధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అభ్య ర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించి మెరి ట్‌ ప్రకారం అడ్మిషన్లు ఇస్తారని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్లు వెంట తీసుకుని వచ్చి కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని సూచించారు. స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పొందిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని, హాస్టల్‌ వస తి కూడా ఉండదన్నారు. అభ్యర్థులు టీసీ, అకడమిక్‌ సర్టిఫికెట్లు, అడ్మిషన్‌ రసీదు, అవ సరమైన ఇతర పత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement