ఎల్లారెడ్డి: చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన రుడావత్ గణేశ్ (48) మంగళవారం ప ట్టణ శివారులోని పెద్ద చెరువులో చేపలు పట్టడానికి ఇంటి నుంచి బయలుదేరాడు. చెరువులోకి దిగిన అతడు ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగిపోయాడు. అతడి మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బంది సహకారంతో పోలీసులు సాయంత్రం వరకు ప్రయత్నించినా చీక టి పడటంతో సాధ్య పడలేదు. మృతదేహం కోసం బుధవారం ఉదయం గాలింపులు చేపడతామ ని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
నిజాంసాగర్(జుక్కల్):కాలకృత్యాలు తీ ర్చుకునేందు నిజాంసాగర్ ప్రధాన కాలు వలోకి వెళ్లిన ఓ వ్యక్తి నీటమునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల భానుప్రసాద్ (22) సోమవారం సాయంత్రం తుంకిపల్లి గ్రామం నుంచి మహమ్మద్ నగర్ గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. బూర్గుల్ గ్రామ శివారులో ని నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట వద్ద బహి ర్బుమి కోసం వెళ్లాడు. అనంతరం ప్రధాన కాలువ నీటిలో కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాద వశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. కాలువలో గా లింపు చేపట్టగా మంగళ వారం మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
శంకర్‌పల్లి: గ్రామంలోని ఓ మహి ళ మెడలోని పుస్తెలతాడును చోరీకి యత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవర్గాన్‌కు చెందిన కుంబారే సిద్ధారెడ్డి, సునీత దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్‌పల్లికి వచ్చారు. పట్టణంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ దంపతుల కదలికలను గమనిస్తున్న దుండగు డు మంకీ క్యాప్ ధరించి హఠాత్తుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సు నీత కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. అక్కడే కార్ వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రవీణ్ గమనించి వెంటనే పట్టుకుని తనిఖీ చేశాడు. బ్యాగులో కారం పొడి, మంకీక్యాప్, పుస్తెలతాడు లభించింది. అప్పటికే సునీత భర్తకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధారెడ్డి దుండగుడు టిఫిన్ సెంటర్ ఎదురుగా అద్దెకు ఉండే వాసు(45)గా గుర్తించాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వాసు డైలీ ఫైనాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకి తరలించారు.
చేపలు పట్టడానికి వెళ్లి ఒకరు గల్లంతు
చేపలు పట్టడానికి వెళ్లి ఒకరు గల్లంతు