నకిలీలకు తెర..
వారంలోగా పూర్తి చేస్తాం..
ఈ–కేవైసీ పూర్తికి చర్యలు..
● జాబ్‌కార్డులతో ఆధార్ అనుసంధానం
● పని ప్రదేశంలో ఐరిస్ నమోదు
పెర్కిట్(ఆర్మూర్)/కమ్మర్‌పల్లి: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూలీల హాజరును ఈ–కేవైసీతో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ జాతీయ మస్టర్ పర్యవేక్షణ వ్యవస్థ(ఎన్‌ఎంఎంఎస్)ను తీసుకురాగా, కూలీల వివరాలు, ఈ–కేవైసీ నమోదు చేయడం తప్పనిసరి చేసింది. ఈ విధానంలో కూలీల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయడంతోపాటు ఒకరి బదులుగా మరొకరు పనులకు రాకుండా ఐరీస్ నమోదు తప్పనిసరి చేశారు. ఈకేవైసీ పూర్తి చేసుకోని కూలీలకు పనులు కల్పించే అవకాశం ఉండదు. ఒకరి జాబ్‌కార్డుపై మరొకరు పని చేసే అవకాశం ఇక ఉండదని అధికారులు చెబుతున్నారు.
అక్రమాలకు ఆస్కారం లేకుండా..
గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో చేపట్టనున్న ప నుల వివరాల నమోదుకు ఈ–ఎంబీ (ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్ బుక్) విధానాన్ని అమలులోకి తీసు కు వచ్చారు. పనిచేసే ప్రాంతాల వివరాలను గుర్తించిన తర్వాత పనులు కొలతలను ఎంబీ రికార్డు చే సిన అనంతరం ఆన్‌లైన్‌లో ఈ–ఎంబీ చేయాల్సి ఉంటుంది. వివరాలను ప్రత్యేక యాప్‌లో అనుసంధానం చేస్తే ఆయా పనులను ఉన్నతాధికారులు ఎ క్కడి నుంచయిన పరిశీలించవచ్చు. దీంతో ఒకేచోట రెండు పనులు చేయడం వంటి తప్పిదాలకు ఆ స్కారం ఉండదు. నూతన సంస్కరణలతో పనులు పారదర్శకంగా కొనసాగడంతోపాటు, కూలీలకు కూలి చెల్లింపులు న్యాయంగా జరుగుతాయి.
గతంలో పని ప్రదేశం వద్ద కూలీల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. కానీ కొందరు క్షేత్ర సహాయకులు, మేట్‌లు నకిలీ ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. సామాజిక తనిఖీల్లో అక్ర మాలు బయటపడుతుండటంతో వీటిని అరికట్టేందుకు కేంద్రం ఎన్‌ఎంఎంఎస్ యాప్ తీసుకువచ్చింది. ఈ యాప్ కూడా దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించింది. దీంతో నకిలీల హాజరు అరికట్టేందుకు ఈ–కేవైసీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం సెల్‌ఫోన్‌లో ఫొటోలను తీసి అప్‌లోడ్ చేస్తారు. నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తారు. ఒకే వ్యక్తి రెండు ఫొటోల్లో ఉంటేనే కూలీ డబ్బులు అందుతాయి. జిల్లాలో మొత్తం 2,40,605 లక్షల కూలీలు ఉండగా, ఇప్పటి వరకు 1,27,807 మంది కూలీలకు ఈ–కేవైసీ పూర్తయింది.
జిల్లాలో కూలీల ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా నమోదు పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని ఏపీవోలను ఆదేశించాం. ఈ–కేవైసీ విధానానికి కూలీలు పూర్తిగా సహకరించాలి. జిల్లాలో మొత్తం 2,40,605 లక్షల కూలీలు ఉండగా, ఇప్పటివరకు 1,27,807 మంది కూలీలకు ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయింది.
–సాయాగౌడ్, పీడీ, డీఆర్డీవో, నిజామాబాద్
ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో జాబ్ కార్డు ఉన్న కూలీల వివరాలను ఈ–కేవైసీ చేయిస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 50 శాతంపైనే ఈకేవైసీ పూర్తి చేశాం. గ్రామాల్లోని ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు నూతన విధానంపై అవగాహన కల్పించాం. నకిలీ మస్టర్లకు తావులేకుండా అర్హులైన కూలీలందరికి వంద రోజుల పని కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
–సురేష్, ఏపీవో, ఆర్మూర్
ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ హాజరు
ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ హాజరు