
క్రైం కార్నర్
మహిళ ఆత్మహత్య
పిట్లం(జుక్కల్): ఓ వివాహిత మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా..బాన్సువాడ డివిజన్ తాడ్కోలు గ్రామానికి చెందిన చిన్న నాగమణి (52) గత మూడేళ్లుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. చికిత్స చేయించినప్పటికీ వ్యాధి తగ్గకపోవడంతో జీవితం మీద విరక్తిచెందింది. ఈక్రమంలో బుధవారం రాత్రి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి బొల్లపల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్‌రావు తెలిపారు.
ఆటో డ్రైవర్ ..
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు మంగళవారం తెలిపా రు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన తిప్పబోయిన నితిన్(21)ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం నితిన్ ఆటో కిరాయికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి, బయలుదేరాడు. మధ్యాహ్నం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన వ్యవసాయ పొలం వద్ద మామిడి చెట్టుకు ఉరివేసుకుంటున్నట్టు చెప్పి, చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నితిన్ గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసగా మారాడని సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్