
బాన్సువాడలో సినిమా షూటింగ్ సందడి
బాన్సువాడ: బాన్సువాడలో మంగళవారం సినిమా షూటింగ్‌తో సందడి నెలకొంది. పంపారీస్ సాగ (హిందీ) సినిమాలో హీరో–హీరోయిన్లుగా జూబేర్ ఖాన్, అనుషాల నటిస్తుండగా డైరెక్టర్ జూబేర్ ఖాన్, నిర్మాత, రైటర్ అబ్దుల్ అద్నాన్ (బాన్సువాడ) ఉన్నారు. గతంలో పాత బాన్సువాడలో దివంగత వ్యాపారవేత్త విఠల్‌రెడ్డి స్వగృహంలో ఫిదా సినిమా షూటింగ్ చేసిన విషయం తెలిసింది. అదే ఇంట్లో ప్రస్తుతం పంపారీస్ సాగ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. ముంబైకి చెందిన హీరోహీరోయిన్లు, మిగత నటీనటులు షూటింగ్‌కు రావడంతో బాన్సువాడ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తిలకించారు.