
రోడ్లు, కుంటల మరమ్మతులకు నిధులు మంజూరు
భిక్కనూరు: వరదలతో దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, కుంటలు, కాల్వల మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం భిక్కనూరు మండల కేంద్రంలో ఇటీవల వరదలకు తెగిన దాసనమ్మ కుంట కట్ట మరమ్మతు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం వరదలను ప్రత్యేక విపత్తుగా భావించి నిధులను మంజూరు చేసి పనులను ప్రారంభింపజేసిందన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీంరెడ్డి, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, నేతలు దయాకర్‌రెడ్డి, నీల అంజయ్య, సాజీద్, తదితరులు పాల్గొన్నారు.