
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచండి
నిజామాబాద్‌నాగారం: వైద్య సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లోగల డీఎంహెచ్‌వో కార్యాలయంలో సోమవారం ఆమె వైద్యాధికారులు, నర్సింగ్ అధికారులకు, పీహెచ్‌సీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. ప్రతి ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో ఏఎన్‌ఎం, ఆశలు, అర్హులైన గర్భిణుల జాబితాను ఉంచుకోవాలన్నారు. రక్తహీనత గల గర్భిణులను ముందే గుర్తించి వారికి పోషకాహారం ఐరన్ మాత్రలు, ఐరన్ సూక్రోజ్ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అత్యంత ప్రమాదకర లక్షణాలు గల గర్భిణులకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేయాలని, మిగతా గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువగా ప్ర సవాలు చేసిన పీహెచ్‌సీ వైద్యాధికారులతో మాట్లా డి, ప్రసవాలు పెంచేలా కృషి చేయాలని ఆదేశించా రు. ప్రసవానికి ముందే బర్త్ ప్లాన్ ప్రకారం గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లాలని అన్నారు. తద్వారా మాతాశిశు మరణాలను తగ్గించవచ్చన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ శ్వేత, అశ్విని, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, ఏవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఆర్‌పై అవగాహన అవసరం
నిజామాబాద్ నాగారం: ప్రతిఒక్కరికి సీపీఆర్ (కార్డి యో పల్మనరీ రీసెర్సిటేషన్)పై అవగాహన ఉండా లని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. సీపీఆర్ వారోత్సవాల్లో భాగంగా నగరంలో సోమవారం ఆమె సీపీఆర్‌పై వివరించారు.ప్రతి ఒక్కరూ పోషకాహా రం తీసుకుంటూ ఉప్పును తగ్గించాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, జీవనశైలి మార్పుల ద్వా రానే జీవన శైలి వ్యాధులను అరికట్టవచ్చనన్నారు. వారంపాటు జిల్లావ్యాప్తంగా మూడు డివిజన్లలో సీపీఆర్‌పై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.