
రోడ్లకు మరమ్మతులు చేయరూ..!
మద్నూర్(జుక్కల్): మద్నూర్, డోంగ్లీ మండలా ల్లోని పల్లెలకు వెళ్లే రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లపై గుంత లు పడి కంకర తేలడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డోంగ్లీ మండలంలోని కుర్లా వెళ్లే రహదారిపై పలు చోట్ల రోడ్డు తెగి ప్రమాదకరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. రాత్రి సమయాల్లో తెగిన రోడ్డును గమనించని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. లచ్చన్‌గేట్ నుంచి సుల్తాన్‌పేట్, లచ్చన్ గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డుకు అడుగుకో గుంతలు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లకు మరమ్మతులు చేయరూ..!