
బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే
దోమకొండ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నాయకులు ఐరేని నర్సయ్య, తీగల తిర్మల్‌గౌడ్, అబ్రబోయిన స్వామి, రాజేందర్, మర్రి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
అగ్రవర్ణాల కుట్రల్ని తిప్పికొడతాం
కామారెడ్డి టౌన్: బీసీల 42 శాతం రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్న అగ్రవర్ణాల కుట్రల్ని తిప్పికొడతామని బీసీ సంఘాల నాయకులు విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడారు. సమావేశంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్, నాయకులు రాజేందర్, స్వామి, మర్రి శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే