
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరాలు ఇలా.. అచ్చంపేట గ్రా మానికి చెందిన మ్యాదరి శివగంగ, సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె మధురశ్రీ(3) ఆదివారం రాత్రి వేళ ఇంటి ఆవరణలో బహిర్భుమికి వెళ్లింది. కొద్దిసేపటికి ఇంట్లోకి పరుగెత్తుకు వస్తుండగా అదే సమయంలో ఇంటిపక్కనే ఉన్న శ్రీనివాస్ తన వాహనాన్ని తీస్తుండగా ప్రమాదవశాత్తు మధురశ్రీ కాళ్ల పైనుంచి వెళ్లగా తీవ్రంగా గాయపడింది. వెంటనే గమనించి కుటుంబీకులు ఆమెను ఎల్లారెడ్డిలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఇంటికి తీసుకురాగా రాత్రివేళ మళ్లీ ఆమె అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది. ఈమేరకు స్థానిక ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇజ్రాయిల్‌లో వెంకటాపూర్ వాసి..
వేల్పూర్: వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన నీరటి బొర్రన్న(52) ఇజ్రాయిల్ దేశంలో గుండెపోటుతో మృతిచెందినట్లు సోమవారం తెలిసింది. బొర్ర న్న సుమారు 16 ఏళ్లుగా ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశానికి వెళ్లివస్తున్నాడు. అక్కడ ఈనెల 11న ఉదయం స్నానం కోసం బాత్‌రూంకు వెళ్లగా, గుండెపోటుకు గురై మరణించినట్లు తెలిపారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఇజ్రాయెల్‌లో ఉన్న వెంకటాపూర్ గ్రామస్తులు, బంధువులు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నట్లు తెలిపారు.
విద్యుత్ షాక్‌తో గేదె ..
రాజంపేట: మండలంలోని తలమడ్ల గ్రామంలో విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని క్రిష్ణారెడ్డి ఆదివారం రాత్రి తన పొలం వద్ద గేదెను కట్టి ఉంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం వెళ్లి చూ డగా పంట పొలానికి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వ ద్ద చనిపోయి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేకపోవడం వల్ల గేదే కరెంట్ షాక్‌కు గురై మృతిచెందిటనట్లు పేర్కొన్నాడు. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

క్రైం కార్నర్