
దోమలు దండిగా.. ‘ఫాగింగ్’ వృథాగా..
మరమ్మతులు చేయిస్తాం..
దోమలతో ఇబ్బందులు..
● గ్రామాల్లో మూలనపడ్డ ఫాగింగ్ మిషన్లు
● పట్టించుకోని అధికారులు
● విజృంభిస్తున్న దోమలు..
రోగాలపాలవుతున్న ప్రజలు
దోమకొండ: మండల కేంద్రాలు, గ్రామాల్లో దోమల నివారణకు వినియోగించే ఫాగింగ్ మిషన్లను ఎవరూ పట్టించుకోకపోవడంతో మూలనపడ్డాయి. దీంతో దోమలు విజృంభించడంతో ప్రజలు అనారోగ్యానికి గురై తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలువురికి డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు రావడంతో వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. ఫాగింగ్ మిషన్ వల్ల కనీసం దోమలను నివారించడానికి అవకాశం ఉంది. అయినా వాటి వినియోగంపై అధికారులెవరూ శ్రద్ధ చూపడం లేదు.
నిధుల కొరతే కారణం..
జిల్లాలో 22 మండలాలు ఉండగా, 532 గ్రామ పంచాయతీలు, 4,563 వార్డులు ఉన్నాయి. కాగా గ్రామాల్లో సొంత నిధులతో ఫాగింగ్ యంత్రాలు సమకూర్చుకునేలా అయిదేళ్ల క్రితం ప్రభుత్వం ఒక్కో పంచాయతీకి రూ.42 వేలు కేటాయించగా ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో జనాభా, వార్డుల సంఖ్యను బట్టి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఫాగింగ్ చేయడానికి ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కాగా నిధుల కొరతతో అనేక పంచాయతీల్లో ఈ ఫాగింగ్ యంత్రాలను వినియోగించక మూలన పడేశారు. ప్రస్తుతం ఇవి చాలా చోట్ల మొరాయిస్తున్నాయి. వాటికి మరమ్మతులు కూడా చేయించకపోవడంతో జీపీ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్నాయి. పారిశుద్ధ్యానికి నిధులు కేటాయిస్తున్నా వాటిని ఇతర పనులకు వినియోగించడంతో దోమల నివారణ చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న స్థానిక సంస్థల్లో వెంటనే యంత్రాలు కొనుగోలు చేసి దోమల నివారణపై దృష్టి పెడితే వ్యాధులు నియంత్రించే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాల్లో దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. వృఽథాగా ఉన్న ఫాగింగ్ మిషన్‌లకు మరమ్మతులు చేయించి అన్ని గ్రామాల్లో ఫాగింగ్ చేసేలా చూస్తాం. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఖచ్చితంగా గ్రామాలు, వార్డుల్లో దోమల నివారణకు ఫాగింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో, దోమకొండ
మండల కేంద్రంలో దో మలు విజృంభించడంతో ని త్యం ఇబ్బందులు పడుతు న్నాం. గతంలో పంచాయతీ పాలకవర్గాలు ఉండగా, స ర్పంచ్‌లు వార్డుసభ్యులకు స మస్యను విన్నవిస్తే, వారు స్పందించేవారు. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలనలో ఎవరూ సమస్యను పట్టించుకోవడం లేదు. కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలి. – మల్లేశం, దోమకొండ

దోమలు దండిగా.. ‘ఫాగింగ్’ వృథాగా..

దోమలు దండిగా.. ‘ఫాగింగ్’ వృథాగా..

దోమలు దండిగా.. ‘ఫాగింగ్’ వృథాగా..