
ఉపాధి హామీలో ఎఫ్‌ఆర్‌ఎస్
వారం రోజుల్లో పూర్తి
నిజాంసాగర్(జుక్కల్): ఉపాధి హామీ పనుల కల్పనతోపాటు కూలీల హాజరు నమోదులో అవకతవకలు జరుగకుండా పక్కాగా.. పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాబ్‌కార్డు ఉన్న కుటుంబసభ్యుల ఆధార్ కార్డుల అనుసంధానంతోపాటు ఈ–కేవైసీ, పనులు చేసే కూలీల ముఖచిత్రాలు (ఎఫ్‌ఆర్‌ఎస్) నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది.
ఈ–కేవైసీ లింకు!
జిల్లా వ్యాప్తంగా 2,55,661 కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో జాబ్‌కార్డు ఉన్న కుటుంబాలతోపాటు ఉపాధి పనులు చేస్తున్న కూలీల ఆధార్ కార్డు నెంబర్ల ఈ–కేవైసీ చేపడుతున్నారు. ఇప్పటికే ఉపాధి పనులను గూగుల్ యాప్‌లో పొందుపర్చడంతోపాటు పనిప్రదేశంలో ఈజీఎస్ సిబ్బంది కూలీల హాజరును నమోదు చేస్తున్నారు. అయితే, కూలీల హాజరు నమోదులోనూ అక్కడక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. కూలీ డబ్బులు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయి. దీంతో ఉపాధి హామీ పథకం మరింత పక్కాగా అమలు చేయడంతోపాటు పని చేసినవారి చేతికే కూలీ డబ్బులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రోజూ పని ప్రదేశంలోనే కూలీల ముఖచిత్రాల నమోదుకు ఆదేశించింది. విద్యాశాఖ, ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) విధానాన్ని ఉపాధి హామీలో అమలు చేస్తోంది.
జాబ్‌కార్డు ఉన్న కుటుంబసభ్యుల ఆధార్ నెంబర్ల ఈ–కేవైసీ చేపడుతున్నాం. ఉపాధి పనులకు వస్తున్న కూలీల ముఖచిత్రాలను ఫీల్డ్ అసిస్టెంట్లు ఫోన్లలో నమోదు చేస్తున్నారు. వారం రోజుల్లో వందశాతం ఈ–కేవైసీ, ఎఫ్‌ఆర్‌ఎస్ పూర్తయ్యేలా చూస్తున్నాం.
– సుదర్శన్, ఏపీవో, పెద్దకొడప్‌గల్
పక్కాగా పనుల నిర్వహణ
అవకతవకలకు అడ్డుకట్ట
కూలీల ముఖ చిత్రాలు నమోదు
జాబ్‌కార్డులో ఉన్న వారికి ఈ–కేవైసీ
ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేస్తున్న
ఫీల్డ్ అసిస్టెంట్లు

ఉపాధి హామీలో ఎఫ్‌ఆర్‌ఎస్