
స.హ. చట్టం వార్షికోత్సవం
కామారెడ్డి అర్బన్: సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవాన్ని ఆదివారం పట్టణంలోని కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స.హ చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నో విజయాలు సాధించామన్నారు. 20వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు ప్రదీప్‌కుమార్, లింబయ్య, భాస్కర్, షబానా బేగం, జమున, రాజేశ్వర్, అన్వర్ ఘోరీ, పంతులు రవి, వడ్ల అశోక్, డెయిరీ లింగం తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 13,662 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 13,562 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 1405 (17.8 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.
కామారెడ్డి టౌన్: ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ రా ష్ట్ర ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడ రేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమా ర్ నియమితులయ్యారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఇటీవల జరిగిన 8వ జాతీయ కౌన్సిల్ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అందులో ఆయనకు చోటు దక్కింది. ఈ మేరకు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు అనిల్‌ను అభినందించారు.
కామారెడ్డి అర్బన్: ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వెంటనే అందించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంబీర్ మనోహర్‌రావు, జనపాల లక్ష్మిరాజంలు అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించగా వారు పాల్గొని, మాట్లాడారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాల చెల్లింపు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు, పీఆర్‌సీ, డీఏలను వెంటనే అందించాలని తీర్మానించినట్టు వారు వివరించారు.

స.హ. చట్టం వార్షికోత్సవం

స.హ. చట్టం వార్షికోత్సవం