
కొనుగోలు కేంద్రాలకు స్థలాల కొరత
● పలుచోట్ల త్వరలో ప్రారంభం కానున్న వరి కోతలు
● ధాన్యం ఆరబోతకు ఇబ్బందులు
రామారెడ్డి: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థలాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరి ధాన్యం ఆరబెట్టేందుకు సరైన స్థలం, కళ్లాలు లేక రైతులు ఇబ్బందులుపడుతున్నారు. చివరికి రోడ్లపై వడ్లను ఆరబోస్తుండడంతో వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి ఏటా 30 వేల క్వింటాళ్ల ధాన్యం వస్తుంది. మరో పక్షం రోజుల్లో వరి కోతలు మొదలుకానున్నాయి. ఏటా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే స్థలంలో యజమానులు వెంచర్ వేశారు. దీంతో వడ్లు ఎక్కడ ఆరబోయాలనే సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు కొనుగోలు కేంద్రం ఏర్పాటుకూ నిర్వాహకులకు తిప్పలు తప్పేలా లేవు.
ఈసారి వడ్లు ఆరబోసేందుకు ఇబ్బందు లు తప్పేలా లేవు. ఎక్క డ ఖాళీ స్థలం ఉంటే అక్కడే పోయాల్సిన పరి స్థితి వస్తుంది. వడ్ల ఆర బోత, కొనుగోలు కేంద్రాల కోసం దూరం వెళ్లా ల్సి వస్తుందేమో. మధ్యలో వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది. – సలావత్ లక్ష్మి, స్కూల్ తండా
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థలాలు సరిపోవడం లేదు. ఉన్నచోట సర్దుకుపోతున్నాం. గతంలో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండడంతో సమస్యలు తలెత్తలేదు. ప్రస్తుతం అన్ని స్థలాల్లో పంటలు వేయడంతో ఇబ్బందిగా తయారైంది.– గంగారెడ్డి, రైతు రామారెడ్డి

కొనుగోలు కేంద్రాలకు స్థలాల కొరత

కొనుగోలు కేంద్రాలకు స్థలాల కొరత