
ఇంటికి హరిత కళ
25 రకాల మొక్కలున్నాయి
కామారెడ్డి అర్బన్: పచ్చని చెట్లతో నిండిన ఈ ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని జయశంకర్ కాలనీలోని చిట్టిమల్ల అనంతరాములు ఇల్లుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంటి స్థలం పోగా మిగిలినదంతా ప్రకృతికే అంకితమిచ్చారు. ఇంటిపైన కుండిల్లో, ఇంటికి ఇరువైపులా, సందు భాగాల్లో ఫలాలు అందించే మొక్కలు, కూరగాయలు, ఆకుకూరల తదితర మొక్కలు తారసపడతాయి. నిత్యం వంటల్లో వినియోగించే కూరగాయలు, ఆకు కూరలను సేంద్రియ ఎరువులు వేసి పండిస్తున్నారు. ఒకవైపు పోషకాలు మెండుగా ఉండే ఆహారం లభిస్తుండడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.
నాలుగైదు ఏళ్లుగా ఇంటి ఆవరణతోపాటు మిద్దైపె 25 రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు పండిస్తున్నాను. అందుకున్న రోజూ గంట నుంచి రెండు గంటలపాటు శ్రమిస్తాను. మానసికంగా ఎంతో తృప్తి కల్గుతుంది. మొక్కలను స్నేహితుడిలా భావిస్తున్నాను.
– చిట్టిమల్ల అనంతరాములు
పెరటి, మిద్దె తోటలతో
ఆహ్లాదకర వాతావరణం
హరితమయంగా
చిట్టిమల్ల అనంతరాములు ఇల్లు