
ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మేరా యువ భారత్
బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శుక్రవారం మేరా యువభారత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాలపై విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి భారత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. వాటి గురించి విద్యార్థులు సమగ్రంగా తెలుసుకుని గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్య పర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు సునీల్‌రాథోడ్ మాట్లాడుతూ..ప్రజలకు పథకాల గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది పేదలు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అన్నారు. కెనరా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతూ.. ఖాతాదారులు తమ సిబిల్ స్కోర్ పడిపోకుండా చూసుకోవాలని, రుణాలకోసం ప్రాజెక్టు రిపోర్టుతో వస్తే బ్యాంకులు కచ్చితంగా మంజూరు చేస్తాయన్నారు. డీట్ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కళాశాల అధ్యాపకులు భగవాన్‌రెడ్డి, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ వినయ్‌కుమార్, ఎన్‌సీసీ కో–ఆర్డినేటర్ కృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్లు శ్రీనివాస్, రాజేష్, ఎంపీడీవో ఆనంద్ పాల్గొన్నారు.