సెపక్‌తక్రా రాష్ట్ర పోటీలకు సాత్విక్‌ | - | Sakshi
Sakshi News home page

సెపక్‌తక్రా రాష్ట్ర పోటీలకు సాత్విక్‌

Sep 20 2025 6:24 AM | Updated on Sep 20 2025 6:24 AM

సెపక్

సెపక్‌తక్రా రాష్ట్ర పోటీలకు సాత్విక్‌

సెపక్‌తక్రా రాష్ట్ర పోటీలకు సాత్విక్‌ టీఎల్‌ఎం మేళాలో అయిలాపూర్‌ టీచర్‌కు ద్వితీయ స్థానం స్కూల్‌తండాలో గంజాయి మొక్కలు సీజ్‌

కామారెడ్డి అర్బన్‌: సెపక్‌తక్రా రాష్ట్రస్థాయి పోటీలకు చిన్నమల్లారెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి సాత్విక్‌ ఎంపికై నట్లు హెచ్‌ఎం సాయిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు శివరాజ్‌ తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సెపక్‌తక్రా ఎంపికల్లో పాల్గొన్న సాత్విక్‌ ప్రతిభ చూపడంతో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని, ఈనెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు పద్మ జిల్లా స్థాయిలో ప్రదర్శించిన టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌(టీఎల్‌ఎం).. జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించినట్లు మండల విద్యాధికారి షౌకత్‌అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయురాలు ప్రదర్శించిన అక్షర బాలశిక్ష బోధన అభ్యాసనం సులభతరమై విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శనకు ద్వితీయ స్థానం లభించినట్లు తెలిపారు. అలాగే ఆ ఉపాధ్యాయురాలు రాష్ట స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఉపాధ్యాయురాలిని డీఈవో రాజు, ఎంఈవో షౌకత్‌అలీ, హెచ్‌ఎం దామోదర్‌ అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు.

రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని స్కూల్‌తండాలో గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై లావణ్య సిబ్బందితో కలిసి శుక్రవా రం దాడులు నిర్వహించారు. తండాకు చెందిన గంగావత్‌ రాజేందర్‌ తన ఇంటి పెరట్లో అక్రమంగా 25 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం గంజాయి మొక్కలను తొలగించి సీజ్‌ చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే నిందితుడి వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌ను సైతం సీజ్‌ చేశామన్నారు. నిందితుడు విచారణలో తాను వ్యక్తిగత వినియోగం, అమ్మకాల కోసం గంజాయి సాగు చేస్తున్నట్లు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.

సెపక్‌తక్రా రాష్ట్ర పోటీలకు సాత్విక్‌
1
1/2

సెపక్‌తక్రా రాష్ట్ర పోటీలకు సాత్విక్‌

సెపక్‌తక్రా రాష్ట్ర పోటీలకు సాత్విక్‌
2
2/2

సెపక్‌తక్రా రాష్ట్ర పోటీలకు సాత్విక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement