
హోంనీడ్స్ ఉత్పత్తుల విక్రయశాల ప్రారంభం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కెమిస్ట్రీ విభాగం హోంనీడ్స్ ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు పొందే విధంగా తయారు కావాలని ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కళాశాల ప్రాంగణంలో హోంనీడ్ కెమికల్స్ విక్రయశాలను ఆయన ప్రారంభించారు. గృహాల్లో శుభ్రతకు వినియోగించే ఉత్పత్తులను అధ్యాపకులు కొనుగోలు చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె.కిష్టయ్య, కెమిస్ట్రీ విభాగం అధిపతి జి.మానస, సమన్వయకర్త విశ్వప్రసాద్, జయప్రకాష్, అధ్యాపకులు రాజశ్రీ, శారద, శ్రీనివాస్, శ్రీలత, శ్రీనివాస్‌రావు, దినకర్, రాజ్‌గంభీర్‌రావు, గణేష్ పాల్గొన్నారు.