
మోదీ జన్మదినం కాదు నిరుద్యోగ దినం
బాన్సువాడ: ప్రధాన మంత్రి మోదీ జన్మదినం కాదని సెప్టెంబర్ 17న జాతీయ నిరుద్యోగ దినం చేయాలని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు బుధవారం జాతీయ నిరుద్యోగ దినం నిర్వహించారు. నిరుద్యోగులతో కలిసి టీ అమ్ముతూ, బైక్ రిపేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి గద్దె ఎక్కిందన్నారు. అధికారంలో రాగానే నిరుద్యోగుల పొట్టగొడుతుందని మండిపడ్డారు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నా రు. నాయకులు మన్సూర్, తిరుమల్‌రెడ్డి, సలీం, శ్రీనివాస్, అందే రమేష్, గౌస్ తదితరులున్నారు.
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్‌గా చలామణి అవుతున్న సౌదాగర్ అరవింద్‌కు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన అరవింద్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.