
‘పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’
కామారెడ్డి టౌన్ : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. దోమకొండ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన రంగోల్ స్వప్న, నిజాంసాగర్ మండలానికి చెందిన ఇర్ఫానా బేగంకు సంచార చేపల విక్రయ వాహనాలు మంజూరయ్యాయి. వాటిని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో సురేందర్, అడిషనల్ డీఆర్‌డీవో విజయలక్ష్మి, డీపీఎంలు రాజయ్య, సురేష్, ఫిషరీస్ శాఖ అధికారి శ్వేత, జిల్లా సమాఖ్య అధ్యక్షులు పుష్పరాణి, మండల సమాఖ్య అధ్యక్షులు భూలక్ష్మి, సీసీలు శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు.