
‘సకాలంలో రుణాలు మంజూరు చేయాలి’
మరమ్మతుల పరిశీలన
కామారెడ్డి క్రైం: అర్హులైన రైతులందరికీ సకాలంలో పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూములకు సైతం పంట రుణాలను మంజూరు చేయాలన్నారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, డీఆర్‌డీవో సురేందర్, ఆర్‌బీఐ ఏజీఎం రాములు, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, ఎల్డీఎం చంద్రశేఖర్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
మాచారెడ్డి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం మాచారెడ్డి మండలంలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పంచాయతీ రోడ్డుతో పాటు చుక్కాపూర్ మాచారెడ్డి పీడబ్లూడీ రోడ్డు వరకు బండరామేశ్వరంపల్లి రోడ్డు మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఏఈ దుర్గాప్రసాద్, పాల్వంచ తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ దోమకొండ స్వామి, ఏఈఈలు సంజయ్, తేజస్విని ఉన్నారు.

‘సకాలంలో రుణాలు మంజూరు చేయాలి’