
గాంధారి మండలంలో కలెక్టర్ పర్యటన
గాంధారి: మండల కేంద్రంతో పాటు గుర్జాల్, వండ్రికల్ గ్రామాలను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 65 ఇళ్లు కూలిపోయాయి. బాధితులకు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సహాయ కిట్స్‌ను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భా రీ వర్షాలతో జిల్లాలో సుమారు 600 ఇళ్లు కూలాయన్నారు. బాధితులకు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో పలు వస్తువులతో కూడిన సహాయ కిట్స్‌ను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మురళి, తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, జిల్లా రెడ్‌క్రాస్ కమిటీ అధ్యక్షుడు రాజన్న, ప్రతినిధులు సంజీవరెడ్డి, రఘుకుమార్, కృష్ణ మానేటి, నాగేశ్వర్‌రావు, అన్నారెడ్డి, గంగయ్య, కాశెట్టి కిషన్, మాత్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
గుర్జాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో వంటశాలను, వంటలను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు నోటు బుక్కులను అందించారు. అనంతరం గుర్జాల్–వండ్రికల్ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు.