
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి
బాన్సువాడ రూరల్: తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సోమేశ్వర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతి గదిని ప్రారంభించి మాట్లాడారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల పేరిట ప్రైవేటు పాఠశాలకు పంపకుండా గ్రామంలోని పూర్వ ప్రాథమిక పాఠశాలకు పంపించాలన్నారు. హెచ్‌ఎం శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సఫీయాబేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): బ్రహ్మాజీవాడిలో సోమవారం ప్రీప్రైమరీ తరగతులను ఎంఈవో రామస్వామి ప్రారంభించి మాట్లాడారు. కాంప్లెక్స్ హెచ్‌ఎంలు కళ్యాణి, సంగారెడ్డి, ఏఎంవో వేణుశర్మ, సీఎంవో నాగవేందర్, పాఠశాల హెచ్‌ఎం అనిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిరూరల్:తిమ్మాపూర్‌లో సోమవారం ప్రీప్రై మరీ పాఠశాలను ఎంఈవో రాజులు ప్రారంభించా రు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు ఇంద్రజ,హెచ్‌ఎం అనిల్ కుమార్, ఉపాధ్యాయులు ది వ్య,పంచాయతీ కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు.