
ఒక్క బస్తా యూరియా కోసం..
ఒక బస్తా దొరకలేదు
● పనులన్నీ వదిలేసుకొని
రాత్రి పగలు పడిగాపులు
● అన్నారం, రెడ్డిపేట గ్రామాలలో
యూరియా కోసం బారులు తీరిన రైతులు
రామారెడ్డి: రైతులకు ఒక యూరియా బస్తా దొరకడమే గగనమైపోయింది. ఒకరోజు ఒక బస్తా యూరియా కోసం టోకెన్ తీసుకోవడం కోసం క్యూ లైన్, ఆ తర్వాత తీసుకున్న టోకెన్ ద్వారా యూరియా బస్తా తీసుకోవడం కోసం మరో క్యూ లైన్‌లో ఉండాల్సి వస్తోంది. ఆదివారం రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట, అన్నారం గ్రామాలలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. పోలీసులు యూరియా పంపిణీ కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెడ్డి పేటలో 440 బస్తాలు పంపిణీ చేయగా, అన్నారంలోనూ 440 బస్తాలను రైతులకు పంపిణీ చేశారు.
నాకు 79 ఏళ్లు. మబ్బున మూడు గంటలకు వచ్చి లైన్ కట్టిన. లైన్లో నిలబడి కింద పడితే పక్కన కూర్చోపెట్టారు. ఒక బస్తానైనా దొరుకుతుందో లేదో తెలవదు. – సాయవ్వ, రైతు, అన్నారం

ఒక్క బస్తా యూరియా కోసం..