
చిరుత కోసం గాలింపు
మద్నూర్ : మండల కేంద్ర శివారులో చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆదివారం అటవీ అధికారులు చిరుత జాడ కోసం గాలింపు చేపట్టారు. మండలంలోని హండేకేలూర్ శివారులో, పక్కనే ఉన్న మహారాష్ట్రలోని నాగ్‌రాల్ శివారులో చిరుత ఉందన్న సమాచారంతో తెలంగాణతోపాటు మహారాష్ట్రకు చెందిన అటవీ అధికారుల బృందాలు గాలింపు చర్యలలో పాల్గొంటున్నాయి. చిరుత తిరిగిన చోట పాదముద్రలను సేకరించామని జుక్కల్ రేంజ్ ఫారెస్ట్ అధికారి సుజాత తెలిపారు. వాటిని గమనిస్తే చిరుత అడుగులుగానే కనిపిస్తున్నాయని, వాటిని ల్యాబ్‌కు పంపిస్తామని పేర్కొన్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. త్వరగా దానిని పట్టుకోవాలని కోరుతున్నారు.
‘తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా
బతుకమ్మ సంబురాలు’
కామారెడ్డి అర్బన్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పూలపండుగ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలని సంస్కార భారతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేకేవీ శర్మ కోరారు. ఆదివారం సంస్కారభారతి కామారెడ్డి శాఖ కార్యాలయంలో బతుకమ్మ సంబరాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సమ్మిరెడ్డి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజు, మాతృశక్తి కన్వీనర్ ఎన్.ప్రసన్న, ఉపాధ్యక్షులు మనోహర్, చిన్న సిద్ధిరాములు, ప్రతినిధులు రామచంద్రరావు, స్వామిగౌడ్, సాయిబాబాగౌడ్, రమేష్‌గౌడ్, పరమేశ్వర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు
ఉపన్యాస పోటీలు
బాన్సువాడ : బాన్సువాడలోని గిరిజన ఆశ్ర మ పాఠశాలలో ఆదివారం హిందీ దివస్‌ను పురస్కరించుకుని విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మేరా యువ భారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతు లు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సునీల్ రాథోడ్ మాట్లాడుతూ హిందీ భాష నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా భాషా సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం విజయభారతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోచారం ప్రధాన కాలువ
మరమ్మతుల పరిశీలన
నాగిరెడ్డిపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాల కు నాగిరెడ్డిపేట శివారులో దెబ్బతిన్న పోచా రం ప్రధాన కాలువకు చేపట్టిన మరమ్మతులను ఆదివారం ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రధాన కాలువకు చేపడుతున్న మరమ్మతులకు సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్‌కు పలు సూచనలు ఇచ్చారు. మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఇరిగేషన వర్క్‌ఇన్‌స్పెక్టర్ యాదగిరి ఉన్నారు.
‘యాత్రాదానం’ ప్రారంభం
ఖలీల్‌వాడి: పర్యాటక రంగ అభివృద్ధి, ప్రయాణికులకు విభిన్నమైన సేవలు అందించేందుకు ‘యాత్రాదానం– గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్’ పథకాన్ని ప్రారంభించినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న తెలిపారు. ఈ పథకం కింద కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, విద్యాసంస్థలు, సమాజ సేవా సంస్థలు, ఉమ్మడి కుటుంబాలు స్పాన్సర్‌షిప్ ద్వారా బస్సు యాత్రలను అందించవచ్చన్నారు. ఆసక్తిగలవారు 99592 26018(కామారెడ్డి), 99592 26020(బాన్సువాడ), నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

చిరుత కోసం గాలింపు

చిరుత కోసం గాలింపు

చిరుత కోసం గాలింపు