
కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నారు
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
● ప్రభుత్వ వైఖరికి నిరసనగా
జిల్లా కేంద్రంలో ధర్నా
కామారెడ్డి క్రైం: కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో మంగళవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడు తూ కాళేశ్వరాన్ని ఎండబెట్టి తెలంగాణ నదీ జలాల ను పక్క రాష్ట్రాలకు తరలించే కుట్ర ఇదన్నారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడమంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమేనన్నారు. ఓవైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే పట్టించుకునే వారే కరువయ్యారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటి వరకు సీబీఐ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరోజులోనే ఎందుకు మాట మార్చాడో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పజెప్పడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు ముజీబొద్దీన్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు కుంబాల రవి యాదవ్, లక్ష్మీనారాయ ణ, బల్వంత్‌రావు, భానుప్రసాద్ పాల్గొన్నారు.