
నీటి మట్టానికి, నిల్వకు ఎంతో తేడా!
మీకు తెలుసా?
జలాశయాల్లో నీటి మట్టానికి, నీటి నిల్వకు ఎంతో తేడా ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం 1091 అడుగులు కాగా నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉంటుంది.
● ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1070 అడుగుల నీటి మట్టం ఉంది. కానీ, నీటి నిల్వ మాత్రం 22 టీఎంసీలు ఉంది.
● నీటి మట్టం మరో 21 అడుగులకు చేరితే ప్రాజెక్ట్ నిండుకుండలా మారుతుంది. 21 అడుగులే కదా పెద్ద కష్టమేమీ కాదులే అని అంతా భావిస్తారు.
● ప్రాజెక్ట్ నీటి మట్టం పెరిగిన కొలదీ విస్తీర్ణం పెరుగుతుంది. దీంతో ఒక్కో అడుగుకు ఎక్కువగా నీరు నిల్వ ఉంటుంది. చివరి మూడు అడుగుల్లో ఒక్కో అడుగుకు 6 టీఎంసీల నీరు అవసరమవుతుంది.
● ప్రాజెక్ట్ నీటి మట్టం 1045 అడుగుల నుంచి ప్రారంభమైంది. నీటి నిల్వ సామర్థ్యం 1 టీఎంసీల నుంచే ప్రారంభమవుతుంది.
– బాల్కొండ