
పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఎంపీడీవో సంతోష్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలో చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వహణ తీరును శనివారం ఆయన పరిశీలించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌ను ఆదేశించారు. ఎంపీవో సురేందర్‌రెడ్డి, ఆశ కార్యకర్తలు పద్మావతి పాల్గొన్నారు.
మందులు అందుబాటులో ఉంచాలి
ఎల్లారెడ్డిరూరల్: ఆస్పత్రిలో సరిపడా మందులను అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆర్డీవో పార్థసింహారెడ్డి ఆదేశించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. మందు ల కొరత ఉంటే సమస్యను పరిష్కరిస్తామన్నారు.
అధికారులు అందుబాటులో ఉండాలి..
వర్షాలు అధికంగా కురుస్తున్న దృశ్యా అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి అన్నారు. ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు. వాగులు పొంగే ప్రాంతాలలో సిబ్బంది 24 గంటలు విధులు నిర్వర్తించాలన్నారు.