
విధుల్లో చేరిన ఈ పంచాయతీ ఆపరేటర్లు
కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి/బాన్సువాడ రూరల్: తమ డిమాండ్‌ల సాధన కోసం 5 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టిన ఈ పంచాయతీ ఆపరేటర్‌లు శనివారం విధుల్లో చేరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విధుల్లో చేరుతున్నామని ఈ పంచాయతీ ఆపరేటర్‌ల సంఘం జిల్లా ప్రతినిధులు తెలిపారు. శనివారం సాయంత్రం స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్‌ను కలిసి పని ఒత్తిడిని తగ్గించాలని, తక్కువగా వస్తున్న రూ.3 వేల వేతనాన్ని జీపీ నిధుల్లో నుంచి సర్దుబాటు చేసి ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు.