
యువకుడికి డాక్టరేట్
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామానికి చెందిన నీరడి సూర్యం శనివారం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కొత్త లక్ష్మా రెడ్డి పర్యవేక్షణలో ‘ సింథసిస్, క్యారెక్టరైజేషన్ ఆప్టికల్, మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఫొటోక్యాటెలిటిక్ అండ్ బయాలజీకల్ యాక్టివిటీ ఆఫ్ మాంగనీస్,ఎటర్భియం,యట్రియం,నియోడైమియం అండ్ డిస్ప్రోసియమ్ డోప్ట్ కో బాల్ట్ నానోఫైరెట్స్’’అనే అంశంపై పరిశోధన చే సిన ట్లు సూర్యం తెలిపారు.కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ జాతీయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.