
దంత వైద్య సేవలు అంతంతే
బాన్సువాడ: పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్)లోగల డెంటల్ విభాగంలో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. మానవ శరీరంలో అన్ని అవయవాల మాదిరిగానే దంతాలకు సైతం సమస్యలు వస్తుంటాయి. అయితే దంత సమస్యలు త్వరగా నయం కావు. ఇందుకోసం వివిధ దశల్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అలా జరగకపోతే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఈక్రమంలో బాన్సువాడలోని ప్రభుత్వ డెంటల్ విభాగంలో దంత సమస్యతో బాధపడే వారికి ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందడం లేదు. దీంతో పలువురు తప్పనిసరై ప్రయివేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు.
రోజుకు పదుల సంఖ్యలో రోగులు..
వయస్సుతో సంబంధం లేకుండా ఇటీవల దంత సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. బాన్సువాడ ఎంసీహెచ్‌లో ఓపీకి నిత్యం వివిధ సమస్యలతో 600 నుంచి 700 మంది వస్తుండగా, దంత సంబంధింత చికిత్స కోసం వచ్చే వారి సంఖ 10–15 పైనే ఉంటుంది. కానీ ఇక్కడ సాధారణ చికిత్సలే తప్ప మెరుగైన వైద్యం అందకపోవడంతో నానాటికీ ఓపీ తగ్గుతోంది. ఆధునిక పరికరాలు లేకపోవడంతో పళ్లు తొలగించడం, కొత్తవి అమర్చడం వంటి మైనర్ చికిత్సలే జరుగుతున్నాయి. దీనికి తోడు చికిత్సకు ఉపయోగించే కుర్చీ పాడవడంతో సేవలు మరింత మృగ్యమయ్యాయి. ఈ విభాగంలో రూట్ కెనాల్, టీత్ క్లీనింగ్, దంతాల ఫిల్లింగ్, కాస్మాటిక్స్ తదితర చికిత్స అందించాల్సి ఉంటుంది. కానీ అందుకు సంబంధించి పరికరాలు సమకూర్చక, నిపుణులైన వైద్యులు లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చే వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. దంత విభాగంలో చైర్, మౌత్ మిర్రర్, డిజిటల్ ఎ క్స్‌రే, ప్రొబ్, ఓరల్‌కెమెరా, అల్ట్రాసోనిక్ స్కేలర్, పాలిషింగ్ బ్రష్ తదితర పరికరాలు లేకపోవడం, చై ర్ కూడా చిన్నదిగా ఉండడంతో సేవలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఈక్రమంలో దంత సమస్యలతో వచ్చే వారికి వైద్యులు నొప్పి నివారణ మాత్రలు రా సి పంపిస్తుండడంతో 5–10 మందికి మంచి రావ డం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అన్ని పరికరాలు సమకూర్చితే పేదలకు మెరుగైన వైద్యం అందుతాయని పలువురు కోరుతున్నారు.
బాన్సువాడ ఎంసీహెచ్‌లోని డెంటల్
విభాగంలో వేధిస్తున్న పరికరాల కొరత
పట్టించుకోని అధికారులు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
దంత వైద్య పరికరాలు సమకూర్చడం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రస్తుతం సాధారణ చికిత్సలే అందుతున్నాయి. ఆధునిక పరికరాలు తెప్పించి మిగతా చికిత్సలు చేస్తాం. శస్త్ర చికిత్సలకు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రిలో పరికరాలు అందుబాటులో ఉండవు.
–విజయలక్ష్మి సూపరింటెండెంట్,
మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి, బాన్సువాడ