
ఆంజనేయులు మృతి పార్టీకి తీరని లోటు
కామారెడ్డి క్రైం: తాజా మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్ కామారెడ్డి మండల అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు మృతి పార్టీకి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మాజీ ఎంపీపీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆంజనేయులు పార్ధీవ దేహానికి పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం ఆయన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
నస్రుల్లాబాద్
పోలీసు స్టేషన్ తనిఖీ
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య శనివారం తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది కేసుల పురోగతి సాధించాలన్నారు. పెండింగ్ కేసులను వెంటనే దర్యాప్తు చేసి పూర్తి చేయాలని సూచించారు. ఎస్సై రాఘవేంద్ర, కానిస్టేబుల్‌లు ఉన్నారు.