బాన్సువాడలో తిరంగా ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

బాన్సువాడలో తిరంగా ర్యాలీ

May 22 2025 5:46 AM | Updated on May 22 2025 5:46 AM

బాన్స

బాన్సువాడలో తిరంగా ర్యాలీ

బాన్సువాడ: మన సైనికుల వీరత్వం, త్యా గాలు ఎనలేనివని మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. సైన్యం పరాక్రమానికి ప్రతీక ఆపరేషన్‌ సిందూర్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని పురస్కరించుకుని బుధవారం బాన్సువాడలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాల యం నుంచి పాత అంగడి బజార్‌, తాడ్కోల్‌ చౌరస్తా, రాజీవ్‌ చౌరస్తా మీదుగా అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. జాతీయ జెండాలతో పాటు ఆపరేషన్‌ సిందూర్‌ ప్లకార్డులు, మోదీ కటౌట్‌లతో ర్యాలీతీశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఇంటర్‌

సప్లిమెంటరీ పరీక్షలు

ఎల్లారెడ్డిరూరల్‌: జిల్లాలో గురువారం నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని చీఫ్‌ సూపరింటెండెంట్లు నిజాం, లక్ష్మణ్‌సింగ్‌ తెలిపారు. 29 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్‌ పరీక్షలు ఉంటాయని తెలిపారు.

ఆస్పత్రి పరిశీలన

బిచ్కుంద: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిచ్కుంద ఆస్పత్రిని వంద పడకలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ. 26 కోట్లు కేటాయించిందన్నారు. ఆస్పత్రి భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించేందుకు వైద్య విధాన పరిషత్‌ టెక్నికల్‌ ఈఈ కుమార్‌, ఏఈ సాగర్‌ వచ్చారన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జునప్ప శెట్కార్‌, నాగ్‌నాథ్‌, విఠల్‌రెడ్డి, డాక్టర్‌ కాళీదాస్‌ పాల్గొన్నారు.

తాగునీటి కోసం ఆందోళన

బాన్సువాడ : పాత బాన్సువాడలోని గూడెంగల్లీవాసులు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేను రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. మున్సిపల్‌ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో అన్ని కాలనీలలో మిషన్‌ భగరథ నీళ్ల కోసం పైపులు వేశారని, గూడెంగల్లీలో మాత్రం వేయలేదని పేర్కొన్నారు. తాగునీటి సౌక ర్యం కల్పించకపోతే మున్సిపల్‌ కార్యాల యం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.

పాము కాటుతో

బాలుడి మృతి

నస్రుల్లాబాద్‌: పాము కాటుతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. సంగం గ్రామంలో సుజాత, అశోక్‌ దంపతుల కుమారుడు రిషి కుమార్‌ బుధవారం ఇంట్లో ఆడుకుంటున్నాడు. బాలుడి కాలు నుంచి రక్తం కారుతుండడాన్ని గమనించిన తల్లి గాయం అయి ఉంటుందని భావించి పసుపు రాసింది. కొద్ది సేపటి తర్వాత బాబు కళ్లు తేలేయడంతో భయానికి గురయ్యింది. అంతలోనే పాము కనబడడంతో పాము కరిచి ఉండవచ్చన్న అనుమానంతో బాలుడిని బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా సిబ్బంది నిజామాబాద్‌కు వెళ్లమన్నారు. అప్పటికే శరీరం అంతా విషం వ్యాపించడంతో బాలుడు మృతి చెందాడు. ముగ్గురు కూతుళ్ల తర్వాత ఎంతో కాలానికి కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో కురిసిన భారీ వర్షానికి పాము ఇంట్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

బాన్సువాడలో తిరంగా ర్యాలీ
1
1/4

బాన్సువాడలో తిరంగా ర్యాలీ

బాన్సువాడలో తిరంగా ర్యాలీ
2
2/4

బాన్సువాడలో తిరంగా ర్యాలీ

బాన్సువాడలో తిరంగా ర్యాలీ
3
3/4

బాన్సువాడలో తిరంగా ర్యాలీ

బాన్సువాడలో తిరంగా ర్యాలీ
4
4/4

బాన్సువాడలో తిరంగా ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement