మహాలక్ష్మి బకాయిలను చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మి బకాయిలను చెల్లించాలి

Apr 15 2025 1:58 AM | Updated on Apr 15 2025 1:58 AM

మహాలక్ష్మి బకాయిలను చెల్లించాలి

మహాలక్ష్మి బకాయిలను చెల్లించాలి

కామారెడ్డి టౌన్‌ : మహాలక్ష్మి పథకానికి సంబంధించిన బకాయిలను ఆర్టీసీకి వెంటనే చెల్లించాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌(బీఎంఎస్‌) రాష్ట్ర సంఘటన మంత్రి రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. సో మవారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌ మైదానంలో బీఎంఎస్‌ అనుబంధ టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘ్‌ నాలుగో రాష్ట్ర మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలన్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. కార్మికులపై వేధింపులు మానుకోవాలని, రిమూవ్‌ విధానాన్ని రద్దు చేయాలని బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్‌ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సంస్థలో అన్ని విభాగాల్లో చాలా ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ జాతీయ అధ్యక్షుడు కొండల సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్మిక్‌ సంఘ్‌ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

బీఎంఎస్‌ అనుబంధ టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక్‌ సంఘ్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటాచారి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బసంత్‌, ఉపాధ్యక్షుడిగా శోభన్‌ బాబు, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర స్వామి, కోశాధికారిగా రమేష్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా నోముల ప్రసాద్‌, సెక్రెటరీలుగా వెంకట్‌ యాదవ్‌, మాణిక్యం, ఎల్లం, రమేష్‌, నర్సింలు, శివకుమార్‌, అనసూయ, రవీందర్‌ గౌడ్‌, మనోహర్‌రావు, కులకర్ణి, సలహాదారులుగా వెంకట్‌రెడ్డి, తిరుపతి గౌడ్‌, రాఘవులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఇన్‌చార్జీగా పి.శ్రీపతి, హైదరాబాద్‌ జోన్‌ ఇన్‌చార్జీగా టి.పోషాద్రి ఎన్నికయ్యారు.

ఆర్టీసీ ఉద్యోగులను

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

బీఎంఎస్‌ రాష్ట్ర సంఘటన

మంత్రి రామ్మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement