బాన్సువాడ గడ్డ.. బీఆర్‌ఎస్‌ అడ్డా | - | Sakshi
Sakshi News home page

బాన్సువాడ గడ్డ.. బీఆర్‌ఎస్‌ అడ్డా

Mar 25 2025 1:37 AM | Updated on Mar 25 2025 1:33 AM

బాన్సువాడ: బాన్సువాడ గడ్డ బీఆర్‌ఎస్‌ అడ్డా అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడ పెద్ద మజీద్‌ వద్ద నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ హయాంలో ముస్లింల కోసం షాదీముబారక్‌ పథకం ప్రవేశపెట్టామన్నారు. రంజాన్‌ పండుగను అధికారికంగా నిర్వహించి పేద ముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రంజాన్‌ తోఫా ఇవ్వడం లేదని విమర్శించారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నాయకులు వస్తారు.. పోతారని, కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పటికీ ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు అయెషాబేగం, సుమిత్ర, జుబేర్‌, కిషన్‌, మోచీ గణేష్‌, గౌస్‌, సాయిబాబా, సాయిలు, శివ, రమేష్‌యాదవ్‌ తదితరులు ఉన్నారు.

మళ్లొచ్చేది మన ప్రభుత్వమే

నిజాంసాగర్‌: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలి చేది బీఆర్‌ఎస్‌ పార్టీనేనని, వచ్చేది కేసీఆర్‌ ప్ర భుత్వమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సో మవారం బాన్సువాడ పట్టణంలో నిర్వహించే ఇఫ్తార్‌ విందులో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు మండల బీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎన్నికలు ఏవైనా బీఆర్‌ఎస్‌ ప్రభంజనం తప్పదన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దుర్గారెడ్డి, విఠల్‌, రమేశ్‌గౌడ్‌, రమేశ్‌, విఠల్‌గౌడ్‌, శ్రీకాంత్‌రెడ్డి, రాములు, సుభాష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం రంజాన్‌ తోఫా ఇవ్వడం లేదు

ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్సీ కవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement