
కోర్టు దూరం.. ప్రజలకు భారం
ఆర్మూర్: జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు ఏర్పాటు కోసం భీమ్‌గల్‌తోపాటు ఐదు మండలాల ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిమినల్, సివిల్ కేసుల విషయంలో ఆర్మూర్ కోర్టుకు వెళ్లేందుకు ఇబ్బందులుపడుతున్నారు. సిరికొండ, వేల్పూర్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాలకు అందుబాటులో ఉండేలా భీమ్‌గల్‌లో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు 2007లో మంజూరైంది. కాగా, ఆ కోర్టును ఆర్మూర్‌లో ఏర్పాటు చేయడంతో సమస్య మొదలైంది. ప్రజలు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, పోలీసులు వివిధ కేసుల విషయంలో ఆర్మూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూరభారం, సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. దీంతో కోర్టును సాధించుకునేందుకు భీమ్‌గల్ ప్రాంతీయులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా భీమ్‌గల్‌లో కోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలంటూ 2023 నవంబర్ 8న ఆర్మూర్ కోర్టుకు ఆదేశాలు వచ్చాయి. 500 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉంటేనే కొత్తగా కోర్టు మంజూరు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ, భీమ్‌గల్ పరిధిలోని ఆరు మండలాలను కలిపి సుమారు 2,500 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండడంతోపాటు భీమ్‌గల్ మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈ గణాంకాల ప్రకారం భీమ్‌గల్‌లో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలంగాణ రాష్ట్ర లా సెక్రటరీకి నివేదిక రూపంలో సమర్పించి భీమ్‌గల్‌కు కోర్టు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని కోర్టు
భీమ్‌గల్‌లో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్
కోర్టు ఏర్పాటుకు విజ్ఞప్తులు
ఆర్మూర్‌లో నిర్వహణతో
ఇక్కట్లుపడుతున్నామని ఆవేదన
భీమ్‌గల్ పరిధి మండలాల్లో 2,500కు పైగా క్రిమినల్ కేసుల పెండింగ్
ఇబ్బందిగా ఉంది
ఆర్మూర్ కోర్టులో గృహహింస, మెయింటెనెన్స్ కేసు నడుస్తోంది. నేను ఆర్మూర్‌కు వెళ్లాలంటే 62 కి.మీ ప్రయాణించాలి. మా గ్రామం నుంచి ఆర్మూర్‌కు బస్సు సౌకర్యం కూడా లేదు. ఇబ్బందిగా మారుతోంది. అదే కోర్టు భీమ్‌గల్‌లో ఉంటే మాలాంటి వారికి సౌకర్యంగా ఉండేది.
– భూక్య లత, పాకాల, సిరికొండ మండలం

కోర్టు దూరం.. ప్రజలకు భారం